![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-399 లో.. తన ముగ్గురు కొడుకులతో కూర్చొని వేదవతి మాట్లాడుతుంది. ఆయనకి మీరంటే ప్రాణం రా.. ఎప్పుడు మీరంతా కలిసే ఉండాలని ఆయన తాపత్రయం.. అందుకే నువ్వు జాబ్ చూసుకొని ఎక్కడ ఇల్లరికం వెళ్ళిపోతావేమోనని దిగులు అని సాగర్ గురించి వేదవతి అంటుంది. అలాగే మీరు ముగ్గురు కలిసే ఉంటామని నాకు ప్రామిస్ చేయండి అని వేదవతి అడుగగా అందరు మాట ఇస్తారు. కానీ సాగర్ ఆలోచిస్తాడు. ఏంటి సాగర్ నీ మనసులో ఏదైనా ఉందా అని వేదవతి అడుగగా అదేం లేదని సాగర్ అంటాడు.
ఆ తర్వాత రైస్ మిల్ నుండి పెద్దోడు ఇంటికి వస్తాడు. ఆ డబ్బు చూసి శ్రీవల్లి సంబరపడిపోతుంది. ఈ డబ్బు ఎంతా ఎక్కడిది అని శ్రీవల్లి అడుగగా రైస్ మిల్ డైలీ కలెక్షన్ అని పెద్దోడు అంటాడు. దాంతో అప్పుడే కోటీశ్వరులు అయినట్టు కలగంటుంది శ్రీవల్లి. ఇక నర్మద, ప్రేమల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుగా కలగంటుంది శ్రీవల్లి. ఇక పెద్దోడు లెక్క క్లియర్ చేసుకొని వెళ్తుంటాడు. దాంతో ఎలాగైనా బుట్టలో వేసుకోవాలని చెప్పి హగ్ చేసుకొని ప్రేమ ఉన్నట్టుగా యాక్ట్ చేస్తుంది. దాంతో అదంతా నిజమే అని పెద్దోడు అనుకుంటాడు. మరోవైపు ఆనందరావు చేతికి మల్లెపూలతో మంచి ఊపు మీద భాగ్యం దగ్గరికి వస్తాడు. ఏంటని భాగ్యం అడుగగా ఈ రోజు నాలోని కళని బయటకు తీసాను.. రెండు వేలు సంపాదించాను.. అందులో రెండొందలు పెట్టి నీకు మల్లెపూలు కూడా తీసుకొచ్చానని ఆనందరావు అంటాడు. ఎక్కడ దొంగతనం చేశావని భాగ్యం అడుగగా రైస్ మిల్ లో కౌంటర్ నుండి దొంగతనం చేశానని ఆనందరావు అనగానే అతడిని ఒక్కటి పీకుతుంది భాగ్యం. ఏదో రోజు దొరికిపోతే నిన్ను మిల్ కి రావొద్దంటారు. దాంతో ఉన్నది పోతుంది.. ఉంచుకున్నది పోతుందని ఆనందరావుని తిడుతుంది భాగ్యం.
మరోవైపు ఒక్కరోజులో ఇరవై లక్షలు ఎలా తేవాలో తెలియక సాగర్ తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. అప్పుడే నర్మద ఒక ప్లేట్ లో అన్నం తీసుకొని వస్తుంది. నాకు వద్దు తర్వాత తింటా అని సాగర్ అనగానే ఏం పర్లేదు. నా భర్త అలిసిపోయి వస్తే ఆ మాత్రం తినిపించకూడదా అంటూ తినిపిస్తుంటుంది నర్మద. ఇక ప్రశ్నలు మొదలెడుతుంది. అవునండి మీరు ఎగ్జామ్ ఎప్పుడు రాసారని సాగర్ ని నర్మద అడుగగా లాస్ట్ మంత్ పదహారు అని చెప్తాడు. ఆ రోజు మనం గుడికి వెళ్ళాం.. అర్చన టికెట్లు కూడా ఉన్నాయని అంటుంది. దాంతో సాగర్ కి పొలమారుతుంది. ఇక పదహారు కాదు పదిహేడు అని అంటాడు. ఎగ్జామ్ తిరుపతిలో అన్నావ్ కదా అని మళ్ళీ అడుగుతుంది నర్మద. నువ్వు నిజంగానే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యావ్ కదా.. కాదని నా ఫ్రెండ్స్, కొలీగ్స్ అంటూ ఉంటే నేను మాత్రం అలా కాదంటూ మీరు నిజాయితీగా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారని గొడవ పడుతున్నానని నర్మద అంటుంది. అవునని సాగర్ అంటాడు. ఆ వనజకి ఇవ్వాల్సిన ఇరవై లక్షలు అకౌంట్ లోనే ఉన్నాయి కదా అని నర్మద అడుగగా హా ఉన్నాయంటూ సాగర్ చెప్తాడు. ఒక్క నిమిషం ఆ రమ్య ఎందుకు అలా చెప్పిదంటూ తనకి కాల్ చేస్తుంది నర్మద. ఇక ఫోన్ ని లౌడ్ స్పీకర్ లో పెట్టి మాట్లాడుతుంది నర్మద. రెండు రోజుల క్రితం సాగర్ ఇరవై లక్షలు విత్ డ్రా చేసి తీసుకెళ్ళాడని చెప్పావ్.. మా ఆయన అకౌంట్ లోనే ఉన్నాయని అంటున్నాడని నర్మద అంటుంది. లేదే నిజంగానే తీసుకెళ్ళాడే.. కావాలంటే రేపు బ్యాంక్ మొదలవ్వగానే డీటేయిల్స్ నీకు పంపిస్తానని రమ్య అనగానే సాగర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |